Friday, December 12, 2008

సర్వం vaasudevam


సర్వం వాసుదేవం మనకు ఇంత మంది దేవుళ్ళా! చిన్ని బుర్ర లో పెద్ద ప్రశ్న. ఎవరిని ఎలా పూజించాలో ................. ఎవరిని వదిలేస్తే........... ఎవరికి కోపమోస్తుందో అనేక అనుమానాలు వేదం ఘోషిస్తుంది ............ భగవానూడొక్కడే ...... నారాయనుడీతడు నరులరా

మరి మిగిలిన వారంతా మనకు అర్ధం కాని ప్రశ్న

మరి జవాబు....... ఆ గోవిందుడే తెలియ చేశాడు ఒక సంఘటన ద్వారా.

శ్రీకృష్ణుడు బృందావనం లో పెరుగుతున్నపుడు రోజు లేగదూడ లను తోలుకుని యమున తీరాన వున్న అడవికి వెళుతుండేవారు తోటి గోప బాలుర తో కలసి. ఒక రోజు అలానే వెళ్ళి, భోజనసమయానికి అందరు కలసి ఒక చోట చేరి తమ తమ ఆహారాన్నీ తీసుకుంటున్న సమయం లో అఘాసురుడు అనే రాక్షసుడు వారిని సంహరించటానికి పెద్ద సర్పాకారం ధరించి నోటిని పెద్ద కొండ గుహ వలె తెరిచి వారిని మ్రింగి వేస్తుంటాడు. అపుడు కృష్ణుడు అతనిని సంహరించి గోప బాలుర ను రక్షిస్తాడు. ఈ సన్నివేశాన్ని, దేవతలందరు గమనిస్తుంటారు. అందరు సంతోషం తో పూల వాన కురిపిస్తారు, ఆది గమనిస్తున్న బ్రహ్మ ఆ నారాయణుని శక్తి ని పరీక్షించాలని , కృష్ణుడు అఘాసురుని సంహరించే సమయం లో గోప బాలుర ను,లేగదూడ లను అపహరించుకు వెళతాడు.

కృష్ణుడు చూసే సమయానికి ఎవరు కనిపించరు. ఆలోచిస్తే, ఇది బ్రహ్మ పని అని అర్ధం అవుతుంది. ఇప్పుడెలా, అపహరించింది సాక్షాత్ బ్రహ్మ దేవుడు వారి రక్షణ భారం తనది. వారి కోసం తల్లులు, లేగదూడ ల కోసం గోవులు ఎదురు చూస్తుంటాయి. వెంటనే కృష్ణుడు తానే ఆ గోప బాలుర గాను, లేగదూడ ల గాను రూపాంతరం చెందుతాడు. అలా ఒక సంవత్సర కాలం గదుస్తుంది. గోకులం లో ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని గుర్తించరు అందరు తమ పిల్లలు సాధారణం గానే ఉన్నట్లు భావిస్తారు కాని కృష్ణ లీలను గుర్తించలెరు. ఈ మాయను చూసిన బ్రహ్మ తన తప్పు తెలుసుకుని, తన దగ్గర వున్న వారందరిని తిరిగి అప్పగిస్తాడు.

దీనిని గమనిస్తే, ఆ వాసు దేవుడే సకల చరా చర జగత్తు మొత్తం నిండి ఉన్నాడని, ఈ సృష్టి ని సక్రమం గ నడిపించటానికి, తానే పంచ భూతాలు గాను, నవ గ్రహాల రూపం లోను, శివ , విష్ణు శక్తి, గణపతి తత్వాలు గాను, ప్రకృతి గాను, సమస్త ప్రాణి కోటి రూపం లోను తనను తాను ఆవిష్కరించుకున్నాడు . ఈ విషయాన్ని అర్ధం చేసుకోగలిగితే సర్వం వాసుదేవమయం.........

అందుకే వేదం చెబుతుంది..................సర్వ దేవతా నమస్కారం కేశవం ప్రతిగఛతి


సర్వం శ్రీకృష్ణార్పణం హరే కృష్ణ

No comments: