Monday, December 15, 2008

paasuram-2, 3


Pasuram-2,3
పాశురం-2

శ్రద్ద గా వినండి ఈ వ్రత నియమాలు తెలుసుకోండి

సూర్యొదయాని కన్నా ముందే స్నానాదికాలు ముగించాలి

సిగను పూలతో సింగారించటం, కనులను రంగులతో తీర్చి దిద్దటం వంటి బాహ్య సౌందర్యపు ఆసక్తి విడిచి భగవంతుని పాదాలపై దృష్టి నిలపాలి

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు. పరులను పౌరుష వాక్యాలతో నొప్పించటం, నిందించటం చేయరాదు పండితులకు ధన ధాన్యాదులు ఉదారంగా సమర్పించాలి. ప్రముఖులను, వేద వేత్తలను విలువైన కానుకలతో సత్కరించాలి

మన జీవన విధానం ఉన్నత మార్గం లో ఉండేటట్లూ చూసుకోవాలి

పాల కడలి లో శేష శయనుడై విశ్రాంతి నొందుతున్న ఆ దేవ దేవుం పాదాలను స్మరిస్తు చక్కని కీర్తన లతో అలరిద్దాం ఈ మార్గాల ద్వారా, ధు:ఖ భూయిష్టమైన ఈ మాయా ప్రపంచం లో నివసిస్తున్నప్పటికీ, నాటి బృందావనం లోని కృష్ణుని సహచరులవలే అవధులు లేని ఆనందాన్ని సొంతం చేసుకుందాం అందుకు మీరే సాక్షులు

పాశురం-3

మనం అనునిత్యం జగత్ పరిరక్షకుడైన ఆ పరమాత్మ "త్రివిక్రమ" నామాన్ని స్మరిస్తూ , పవిత్ర మార్గ శిర స్నానాలు ఆచరించినట్లయితే శారీరిక, మానసిక రుగ్మతలు తొలగి, పరంధాముని అపార కరుణకు పాత్రులమవుతాము.

అదే సమయం లో సమస్త భూ మండలమంతయు, సస్య శ్యామలమై అక్షయం గా వృద్ది చెందుతూ ఉంటుంది.

పంట చేలు ధాన్యపు కంకులతో కళ కళ లాడుతూ ఉంటాయి నీటిలో చేపల గంతులతోనూ, తామర పుప్పోడుల మకరందాన్ని ఆస్వాదిస్తూ తుమ్మెదలు చేసే ఝూంకారాలతోనూ కుండ ల నిండు గా క్షీర ధారలు కురిపించే పశు గణాలు తోనూ, విర బూ సిన సుమాలతొను, భూ మాత చిరు నవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఈ భూమి సమస్తం మధువు తోనూ, క్షీరం తోనూ నిండి ఉంటుంది

No comments: