Tuesday, December 16, 2008

పాశురం-4


ఓ పర్జన్యా , వరుణుని కి అధినాయకుడా!సాధారణంగా మా పై నీవు చూపించే కృప లో ఎటువంటి లోటు రానీయకుగంభీరం గా కనిపించే సాగర గర్భం లోనికి నీ తీక్షణ కిరణాలను ప్రసరింప చేయినీటిని సంగ్రహించి, వేగం గా , గర్జనలు చేస్తూ ఆకాశం లో చలిస్తు వుంటేనల్లని నీ ఆకారం ఆ శ్రీ మన్నారాయణుని స్పురణ కు తెస్తుంది.ఆజానుభాహువు అయిన కమల గర్భుని కుడి చేతి లోని చక్రపు తేజస్సునుండి వెలువడినచిన్న కాంతి రేఖ మెరుపు గా జగతి ని వెలుగు చిందిస్తుంది.హరి ఎడమ చేతి లోని శంఖం నుండి వెలువడిన మృదువైన శబ్ధమ్ ఉరుము గా మారిలోకాన్ని ఆశ్చర్యంలో ముంచుతుందిఆ శ్రీ రాముని శరమ్ నుండి వెల్లువెత్తిన బాణపు వరద వలేప్రేమ వర్షం ధారలుగా కురుస్తుందిఆ వర్షం లో తడసిన జగతి కొత్త వూ పిరులు పోసుకుంటుందిరండి, మనం కూడా ఆ సంతోషం లో భాగం పంచుకుందాం.

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

ఏ రోజు పాశురము ఆరోజే అయితే బాగుంటుందనుకుంటా.