maa palle MANTRIPALEM
Thursday, May 15, 2025
గీతాచార్యుడు
నాది
నావారాలను మోహము వీడి నిస్సంగుడ కమ్ము
ప్రోది ఫలాశ వీడి ఫలవృక్షరాజభంగి ప్రయత్నశీలి కమ్ము
మోది జిహ్వచాంచల్యమణిచి నిస్సంశయ శరణార్ధి
కమ్ము
ఇదియే సుఖజీవన మార్గము సవ్యసాచీ అనె సర్వనిలయుడౌ గీతాచార్యుడు
Tuesday, May 13, 2025
సుందరి గోపిక
సుందర వనముల హృదయ మందిరమందు నిలచిన కడు
సుందరుడా బాల ముకుందుని ముద్దుమోవిగని విరహమునా
సుందరి గోపిక మనసుపూదోటలో విరిసిన రస భావమాలికల
సుందరమగు అక్షర కూర్పుతో అక్షరుని అభిషేకించసాగె
Monday, May 12, 2025
పగడపు పెదవుల విల్లు
పగడపు పెదవుల విల్లు విడిచిన ముత్యాల
పలువరుస చిరునగవు శరములు మదిని గుచ్చ
వజ్రపు తునక మెరయు సంపంగి నాశికా పరిమళాల మనసు మురియ
ప్రేమ కొలనులో విప్పారిన కలువ కనుల విరిచూపుల జల్లులలో మేని తడువ
పూర్ణచంద్రుని తలపించు మోములో పూయు
నునుసిగ్గు మొగ్గల వెన్నల కాంతుల వర్షధార
సంతతముగా నను తడపనిమ్ము నెచ్చెలి
Sunday, May 11, 2025
చెంగావి కుసుమ
కుంకుమ పరాగమలదిన గుండు మల్లియ మోముతో
మక్కువ జలజపు జల్లుల విరియు కనులతో
చక్కని చిరునగవు వెన్నల తడితో మొరయ
పగడపు పెదవులతో
ఎక్కడ పూచెనీ చెంగావి కుసుమ కోమలి కనులెదుట నిలిచెనీ మనోహరీ
Saturday, May 3, 2025
మాధవుని
కుంతలము మకరందపరిమళ పుష్పమాలిక చుట్టి
శిఖముపై పంచెవన్నల మయూఖ పింఛము నిలిపి
పట్టు పీతాంబరము దాల్చి విహంగ వీక్షణ చేయు
మాధవునిచేరె శుకములు మామిడని మాధుర్యము గ్రోల
ముద్దు ముద్దు పల్కుల ముదము గూర్చిన
శుకముల ఖ్యాతి లోకమున ఇనుమడింప
శుకబ్రహ్మపు నోట ఒలికించె మక్కువతోడ
మధురభాగవత సుధారసధార మాధవుండు
Friday, May 2, 2025
మందార మందారా
గులాబి రేకుల పెదవుల చిట్టి సున్నుండ చుట్టి
కలువ కనుల మమ కారపు తేనియ జల్లుతూ
నెలవంక నగుమోము సిగ్గు మల్లియలు పూయ
నీలపు ఛాయ దాల్చి నిలిచె ముంగిట మందారం
Thursday, April 24, 2025
శుకశారీ
హరికథాసుధ గానము చేయుచూ నొక శుకము
హరినామామృత బిందులేఖనముతో నొక శారీ
హరిత వన తరువుల ఒడిలో సంవాదుచేసె
హరిలీలావిలాసపు మర్మములెల్ల అనురక్తితో
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)