Monday, March 10, 2025
శ్రీమన్నగర నాయికా
Sunday, March 9, 2025
రతీపతి జనకుని
కాళింది మడుగులో కాళిందుని శిరములపై
Wednesday, March 5, 2025
ఆత్మబంధు
వ్యామోహపు మకరముల పాల్బడి విలవిలలాడుచును
నిర్మోహత్వంబు పొందదు నా మనంబు నీ కృప లేకను
కలిసి తిరిగితిమి కాలచక్రమంతయు దేహదారినై నేను
ఆత్మలింగమై నీవు ప్రతి కదలికలో వేదన చెందితి నేను
వేడుక చూసితి నీవు ఆటలు చాలిక ఆత్మబంధు నిర్మల
జ్ఞానమొసగి దయ చూపు దక్షిణా
మూర్తి స్వరూపా శ్రీకాళహస్తీశ్వరా
Saturday, February 15, 2025
పద్మసుందరీ ప్రియుని
పృధివీపంకజ పరాగం గోపికాంగానల మేని గంధమై మెరియ
Thursday, February 13, 2025
నవద్వీప సుధాకరా
చైతన్య కృష్ణచైతన్యో గౌరంగో ద్విజనాయకః
ప్రేమభక్తి ప్రసాదశ్చైవ శ్రీశచీ నందన స్తథా
ఓ ముద్దబంతి
బంతి ఓ ముద్దబంతి
రవివర్మకే అందని
నా మనసు కు అందిన ఒకే ఒక అందానివో
రవి చూడని
నే కాంచిన కాంచన శిల్పానివో
బ్రమరం చేరని
నా చూపులు తాకిన పుష్ప
మాలికవో
ఎవరివో నీవెవరివో
దివిలోని తారకవో
భువి పైని పూబాలికవో
సాగరమందున స్వాతిముత్యానివో
సమిరంలో సుగంధాలు నింపు సన్నజాజివో
ఆకాశాన సప్తవర్ణాల హరివిల్లువో
అచలాగ్రాన ప్రకాశించు రత్న రాశివో
తూరుపు దిక్కున అరుణారుణిమ వర్ణానివో
పడమటి సంద్యారాగానివో
కవి హృదయాన కావ్య కన్యకవో
చిత్రకారుడి కుంచెలో ఒదిగిన సజీవ సౌందర్య మూర్తివో
నివెవరైతేనేం
నిన్ను ప్రేమించటం మాత్రమే తెలిసిన ఈ సామాన్యుడి
గుండె చప్పుడు నీవు
ఆలోచనల ఆది నీవు
ఆనందాల ప్రోది నీవు
ఊపిరి నీవు
బంతి ఓ ముద్దబంతి
నిజం నీవు
నీడను నేను
Tuesday, February 11, 2025
విచలితం
నల్లని పొడుగైన ఉంగరాలు తిరిగిన ఆ చిన్ని కృష్ణుని
కేశాలు తల్లి యశోదకు నయనానందకరం కాగా
వాటిని నెమలి పింఛం తోను , సువాసనలు వేదజల్లేడు పూలతోను
అలంకరించి మురిసిపోతున్నది
నవమి నాటి చంద్రుని పోలిన విశాలమైన కృష్ణుని ఫాల భాగం
బ్రమరాలను ఆకర్షింపచేయుచున్న పూల వలె , చిరుగాలికి
నుదుటి పైకి జారిన ముంగురులతో గోపికలకు ముద్దుగొల్పుచున్నది .
కృష్ణుని అధరామృతాన్ని నింపుకున్న వేణు గానం సమస్త జీవకోటికి
చైతన్యం కలిగిస్తున్నది
ఆ లావణ్యమైన కృష్ణుని ముఖారవిందం గోపికల మనస్సులను
మదనుని వలపు బాణాల తాకిడికి చలించిపోతున్న ప్రేమికుల మనోరధం
వలె విచలితం చేస్తున్నది
మురళీవిలాస ముగ్ధ ముఖామ్బుజంతో విరాజిల్లు చిన్ని కృష్ణుని
ముఖ సౌందర్యాన్ని వీక్షిస్తూ ముల్లోకాలు కూడా అద్బుత ఆశ్చర్యాలకు
లోనవుతున్నాయి
ఎర్రని దొందపండ్ల వంటి లేత పెదవులపై మురళి ని అటునిటు విలాసంగా తిప్పుతూ విశాలమైన విలోచనాలలో మదుర భావనలు పలికిస్తూ గోపికలతో ముచ్చటిస్తున్న తీరును చూసి పరవశులవని వారెవరైనా వుంటారా
అట్టి కృష్ణుని సౌందర్యాన్ని చూడజాలని కనులు నెమలి పించముపై అందంగా తీర్చబడిన కనులవలె ఎంత సుందరములైనప్పటికి వ్యర్ధములే కదా