రాజాధిరాజాయ యదుకులభూషణాయ
రాజాధిరాజాయ యదుకులభూషణాయ యశోదా నందనాయ మహిత మంగళం
అర్థం: రాజులకు రాజు అయినవాడికి (సర్వాధికారికి),యాదవ వంశానికి అభరణం వంటివాడికి.యశోదమ్మ ముద్దుల కొడుకైనవాడికి గొప్పదైన శుభం (మంగళం) అగుగాక.
చిరునవ్వులు చిందించే ముఖం కలవాడు, రాధా దేవి మనసును దోచుకున్నవాడికి,నీలమేఘ శ్యాముడై, అత్యంత సుందరుడైన వాడికి గొప్పదైన శుభం అగుగాక.
వేణువు ఊదే సమయంలో శరీరాన్ని మూడు చోట్ల వంచి నిలబడే అందమైన రూపం కలవాడికి , మూడు లోకాలకు అధిపతి, త్రిపురాసురుడిని సంహరించిన పరమశివుడికి ప్రీతిపాత్రుడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.
విరజాదేవికి ప్రియుడు, వేణుగానం పట్ల ఆసక్తి కలవాడు, బ్రహ్మదేవునికి తండ్రి అయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక
యమునా నది అంటే ఇష్టం కలవాడికి (లేదా కాళింది అనే భార్యకు ప్రియమైన వాడికి), యమునా నదిలోని కాళింగుడనే పాము గర్వాన్ని అణిచినవాడికి (కాళీయ మర్దనం చేసినవాడికి), ద్రౌపది (కృష్ణ) మానాన్ని రక్షించినవాడయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక
పూతన, ప్రలంబాసురుడు వంటి తన భక్తులను ఉద్ధరించినవాడు, పార్వతీదేవికి ప్రియమైన సోదరుడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక .
భూమిని ధరించినవాడు, అర్జునుడికి స్నేహితుడు, ఆనందాన్ని వృద్ధి చేసేవాడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.
గోవర్ధనగిరిని ఎత్తినవాడు, గోవులు, గోపకులు, గోపికల మనస్సులను హరించేవాడు, గోవింద అనే నామం పట్ల ప్రీతి కలవాడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.
