Saturday, October 12, 2024

నీలి వర్ణపు సోయగం

నీలి వర్ణపు సోయగం నీలి కాంతుల పంచె కట్టిన ఆకాశరాజు చూసి భూకాంత బుగ్గపై పూచిన నును సిగ్గు మొగ్గలు  నీలి వర్ణపు మయూరములై హొయలొలికించిన  ముచ్చటతోడ   దట్టమైన నల్లమబ్బు తునకల  మరులు గొని  గగనాధీశుడు ప్రేమ జల్లుల  విరులు కురిపించగా చిరుజల్లుల తాకిడితో ఎద పొంగిన వసుధ  మేని గంధపు సువాసనల  మురిసిన మయూరం పురివిప్పి కప్పిన ఆకు పచ్చని శోభలతో కీంకారపు ధ్వనులతో ఆవని పరవశించే  గగన సీమయే పురుషుడు భూమాతయే ప్రకృతి కాంత  ఇరువురి ప్రేమపూర్వక సమాగమమే  విశ్వమున  శోభిల్లు లక్ష్మీ కళ 

No comments: