Saturday, December 21, 2013

చూచితిలె అజ్ఞాతవాసి

చిలిప చూపులు చిలకరించు చక్రాల చిన్ని కన్నులు
చేప కనులలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 బంగారు పుడకతో నొప్పారు నాసిక 
సంపెంగ సోయగాలలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 సిగ్గుబంతులు బూయించే బూరెల బుగ్గలు 
 ముద్దా బంతులలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

  
పూతరేకుల పై పెదవి పూచే ముత్యపు బిందువులు 
మంచుకాలాన గులాబీ రెక్కపై నిలిచే మంచు బిందువులో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 ఎర్రని దొండ పండు వంటి పెదవులు చిందించు చిరు దరహాసం వెన్నెలలు కురిపించు 
వెన్నెల రేడు కాంతులలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 
అలక పూనిన వేళ ముని వేళ్ళ  స్పర్శతో పులకితమౌ చిరు చుబకం 
అరవంక నెలవంకలొ చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 మృదు మదురమగు కోమలి కంటసీమ 
 శంఖు శోభలలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె  

 నీ సౌందర్య రూపం మమతల మణి దీపం ప్రేమాప్యాయతల ప్రతిరూపం
 నా హృదయ సీమలో భాసిల్లుతుండగా చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

No comments: