Tuesday, December 31, 2013

అలా చూడబోకు

హృదయాన్ని కట్టిపడేసేలా 
మనసును మరిపించేలా 
అజ్ఞాత వాసి అలా చూడబోకు 

బ్రమరాన్ని బంధించే కమలం లా 
కమలాల వంటి నీ కన్నుల కాంతులతో 
అజ్ఞాత వాసి నను కట్టి వేయకు 


వేణునాదానికి పరవశించి వేటగాడికి చిక్కిన లేడిపిల్లలా 
చంద్ర రేఖల వంటి నీ కనుదోయి చందానికి చిక్కితి 
అజ్ఞాత వాసి నను వేధించ బోకు 

మంచు వర్షంతో మూసుకుపోయిన దారులలా 
స్నేహామృతాన్ని వర్షించే నీ చల్లని చూపులలో
అజ్ఞాతవాసి నను ముంచి వేయకు

Saturday, December 21, 2013

చూచితిలె అజ్ఞాతవాసి

చిలిప చూపులు చిలకరించు చక్రాల చిన్ని కన్నులు
చేప కనులలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 బంగారు పుడకతో నొప్పారు నాసిక 
సంపెంగ సోయగాలలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 సిగ్గుబంతులు బూయించే బూరెల బుగ్గలు 
 ముద్దా బంతులలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

  
పూతరేకుల పై పెదవి పూచే ముత్యపు బిందువులు 
మంచుకాలాన గులాబీ రెక్కపై నిలిచే మంచు బిందువులో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 ఎర్రని దొండ పండు వంటి పెదవులు చిందించు చిరు దరహాసం వెన్నెలలు కురిపించు 
వెన్నెల రేడు కాంతులలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 
అలక పూనిన వేళ ముని వేళ్ళ  స్పర్శతో పులకితమౌ చిరు చుబకం 
అరవంక నెలవంకలొ చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

 మృదు మదురమగు కోమలి కంటసీమ 
 శంఖు శోభలలో చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె  

 నీ సౌందర్య రూపం మమతల మణి దీపం ప్రేమాప్యాయతల ప్రతిరూపం
 నా హృదయ సీమలో భాసిల్లుతుండగా చూచితిలె అజ్ఞాతవాసి  చూచితిలె

Saturday, December 14, 2013

ఓ అజ్ఞాతవాసి

నేనొక ఆప్యాయతల అన్వేషిని
నీవేమో ఆప్యాయతల రూపధారివి 
 
నేనొక ప్రేమ పిపాసిని
 నీవేమో ప్రేమకు ప్రతిరూపానివి 
 
 నేనొక ఆశావాదిని 
నీవేమో ఆశకు ఆలంబనవు 
 
 నేనేమో మమతకు దాసోహం 
నీవేమో మమతల మణిదీపం 
 
నేనొక ఆనంద విహారి 
నీవేమో ఆనందాలకు ఆటపట్టు 
 
నేనేమో వినయానికి విధేయుడిని 
నీవేమో వినయ భూషణవు 
 
నాదేమో చక్కని పలకరింతకై ఎదురుచూపు 
నీవేమో  సరస మధుర భాషణవు 
 
 సర్వ సుగుణాల రాశి  లలిత లావణ్య భాసి 
ఓ అజ్ఞాతవాసి
 
ఏనాటికి ఫలించునో ఈ ఎదురుచూపు 
ఎన్నటికి లభించునో ఆప్తుని ఆదరం 
వేచి చూచెదగాక జన్మ జన్మాంతరాలదాక