ఓ యమ్మ ! ని కుమారుడు ,
మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మ !
పోయెద మెక్కడికైనను ,
మా యన్నల సురభులాన మంజులవాణి !
ఓ మంజులవాణి ! మీ పిల్లవాని ఆగడాలు మితి మిరిపోతున్నాయి
మా అన్న నందుని గోవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం
వేరేచటికైనను వెళ్లిపోతాము అని గోపికలు మొర పెట్టుకున్నారు
యశోదమ్మతో
చన్ను విడిచి చనుదిట్టటు
నెన్నడు బోరుగిండ్ల త్రోవ నెరుగడు నేడుం
గన్నులు దెరవని మా యి
చిన్న కుమారకుని రవ్వ సేయమ్దగునే
ఎల్లప్పుడూ నా ఒడిలో నే వుంటూ పాలు త్రగాటమే తప్ప
ఇరుగు పొరుగిండ్ల త్రోవ కూడా తెలియని నా చిన్ని కృష్ణుని మీద
ఇన్ని అభాండాలు వేస్తారా అంటూ ఆ యశోద వారిని కేకలు వేస్తుంది
ఇది మనకు రోజు నిత్యకృత్యమే కదా ……..పిల్లలు అల్లరి చేయటం
ఇరుగు పొరుగు అమ్మలక్కలు పంచాయితీకి వస్తే వారి మీదే మనం
అరవటం
కాని సమస్త లోకాలకు పోషకుడైన ఆ చిద్విలాసముర్తికి
పేద గోపకుల ఇండ్ల లో దూరి కుండలు పగులగొట్టి వెన్న దొంగలించాల్సిన
అవసరమేమిటి
తరచి చూస్తే తత్వం భోదపడుతుంది
ఇక్కడ కుండ ను మన దేహం తో పోల్చుకోవచ్చు
కుండ తయారు కావటానికి మట్టి , నీరు , అగ్ని , గాలి అవసరం అలాగే కుండ
లోపలి భాగం శూన్యం తో వుంటుంది
మన శరీరం కూడా అవే ధాతువులతో నిర్మించబడుతుంది
కుండ పగిలి మట్టిలో కలసినట్లే ఈ శరీరం పగిలి చివరకు ఆ మట్టిలోనే కలసిపోతుంది
ఇక కుండలోని వెన్నను మన మనసుతో పోల్చుకోవచ్చు
వెన్న ప్రధానం గా మూడు లక్షణాలు కలిగి వుంటుంది
అవి తెలుపుదనం , మృదుత్వం , మదురత్వం
మనసు మూడు గుణాలను కలిగి వుంటుంది . అవి సత్వ , రాజ తామస గుణాలు
సత్వగుణం తెలుపు రంగును కలిగి వుంటుంది . శాంతం , సత్ప్రవర్తన , సాదు స్వభావం
ఇవన్ని సత్వగుణం లక్షణాలు
అందుకే తెలుపును శాంతికి చిహ్నం గా వాడతాం
అలాగే మృదుత్వం ………మ్రుదుత్వమంటే తేలికగా కరిగిపోయే స్వభావం
అది దయా గుణానికి చిహ్నం . ఇతరుల సమస్యలను తమవిగా భావించి
వారి కష్టాలను చూసి కరిగి వారికి సహాయం చేయటానికి సిద్దపడటం
ఇక వెన్న యొక్క చివరి గుణం ………పరిమళత్వం తో కూడిన మదురమైన రుచి
అది మనిషి యొక్క మాట తీరుతో పోల్చవచ్చు మనం ఎల్లప్పుడూ
చక్కని మాట తీరు కలిగి , ఇతరులను నొప్పించక వుంటే మనకు అనేక
స్నేహ సమూహాలు ఏర్పడతాయి
అట్టి వారి హృదయాలలో ఆ హృషీకేశుడు కొలువై వుంటాడు
అట్టి మనసున్న వారు కనుకనే గోపికల మనస్సులను దోచుకున్నాడు
ఆ మానసచోరుడు
మరి మనం కూడా మన మనస్సులను నవనీతం చేసి ఆ వెన్న దొంగకు
దోచిపెడదామా
Wednesday, June 11, 2025
ఓ మంజులవాణి
Friday, May 30, 2025
నింగిలోని జాబిల్లి
నింగిలోని జాబిల్లి నేలపైన సిరిమల్లి
ఏటిలోని చేపపిల్ల అడవిలోని జింకపిల్ల
ఆలుచిప్పలో దాగిన ఆణిముత్యం
పూలతేరులో ఒదిగిన కోమలత్వం
పురి విప్పిన మయూరం
అరవిచ్చిన మందారం
ఉక్కపోతలో తాకే పిల్లతెమ్మర
ఒంటరి నడకలో తుంటరిగా తాకే చిరుజల్లు
కలసి కలబోసి కనులముందు నిలచిన కలువబాలా నీవు నిలచిన తావు లక్ష్మీనివాసం
హసితచంద్రమా'
Monday, May 19, 2025
అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు
ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ
నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు
మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం
బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం
మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో
Saturday, May 17, 2025
ఆర్యా ద్విశతీ
ఆర్యా ద్విశతీ ఇదొక సర్వోత్కృష్ఠమైన కావ్యం
దీనిని భావన చేయగలిగితే వారి శరీరమే మణిద్వీపం అవుతుంది హృదయం చింతామణి
గృహమవుతుంది వారిలోని చైతన్యమే పరదేవత అవుతుంది
తలచిన మాత్రం చేతనే మనలను పునీతులను చేయు అత్రీ అనసూయ దంపతుల పుత్రుడు రుద్రాంశ సంభూతుడు క్రోథమే అలంకారంగా గల
మహర్షీ అగు దూర్వాసుడు తాను దర్శించిన అమ్మ లోకాన్ని అందులోని వివిధ దేవతా శక్తులను వారు నివసించే ప్రదేశ విశేషాలను అద్బుతంగా వివరించిన గ్రంధరాజమే ఆర్యా ద్విశతి
ఆర్యా ద్విశతి భావన చేసిన వారికి అంబ సాక్షాత్కరించునని నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి కామాక్షీ అవతారమే అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాక్కు
అట్టి ఆర్యా ద్విశతిని భావనాత్మకంగా వివరించటం ద్వార నా మనసులో ఆ మణిద్వీపాన్ని చెరగని విధంగా చిత్రించుకుని తరించే చిరుప్రయత్నమిది
వందసార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాసిన ఫలమెక్కువ కదా
ఈ విధంగా అమ్మ యెక్క లోకపు ధ్యానం నిరంతరం చెసే ప్రయత్నం
Thursday, May 15, 2025
గీతాచార్యుడు
నాది నావారాలను మోహము వీడి నిస్సంగుడ కమ్ము
ప్రోది ఫలాశ వీడి ఫలవృక్షరాజభంగి ప్రయత్నశీలి కమ్ము
మోది జిహ్వచాంచల్యమణిచి నిస్సంశయ శరణార్ధి
కమ్ము
ఇదియే సుఖజీవన మార్గము సవ్యసాచీ అనె సర్వనిలయుడౌ గీతాచార్యుడు
Tuesday, May 13, 2025
Monday, May 12, 2025
పగడపు పెదవుల విల్లు
పగడపు పెదవుల విల్లు విడిచిన ముత్యాల
పలువరుస చిరునగవు శరములు మదిని గుచ్చ
వజ్రపు తునక మెరయు సంపంగి నాశికా పరిమళాల మనసు మురియ
ప్రేమ కొలనులో విప్పారిన కలువ కనుల విరిచూపుల జల్లులలో మేని తడువ
పూర్ణచంద్రుని తలపించు మోములో పూయు
నునుసిగ్గు మొగ్గల వెన్నల కాంతుల వర్షధార
పలువరుస చిరునగవు శరములు మదిని గుచ్చ
వజ్రపు తునక మెరయు సంపంగి నాశికా పరిమళాల మనసు మురియ
ప్రేమ కొలనులో విప్పారిన కలువ కనుల విరిచూపుల జల్లులలో మేని తడువ
పూర్ణచంద్రుని తలపించు మోములో పూయు
నునుసిగ్గు మొగ్గల వెన్నల కాంతుల వర్షధార
సంతతముగా నను తడపనిమ్ము నెచ్చెలి
Subscribe to:
Posts (Atom)