Monday, January 19, 2026

శ్యామలా నవరాత్రులు

 ఉత్తరతస్తస్య మహా-

-నుద్భటహుతభుక్శిఖారుణమయూఖః ।

తపనీయఖండరచిత

-స్తనుతాదాయుష్యమష్టమో వరణః ॥ 

వెండి ప్రాకారానికి పైభాగాన మహోజ్వలమైనట్టి అగ్ని జ్వాలల వలె అరుణవర్ణంతో  పసుపు ఎరుపు కలసిన

ప్రకాశమానమైన కాంతులతో సూర్యుని (తపనీయ ఖండం)వలే తెల్లని కాంతులతో నిండిన ఆ ఆవరణయొక్క 

అష్టమ ప్రాకారం బంగారంతో నిర్మితమై ధ్యానించు వారలకు ఆయుష్షు పెంపొందించుచున్నది


కాదంబవిపినవాటీ-

-మనయోర్మధ్యభువి కల్పితావాసామ్ ।

కలయామి సూనకోరక-

-కందలితామోదతుందిలసమీరామ్ ॥ 

 వెండి బంగారు ప్రాకారాల నడుమ నున్న భూమి లో కదంబ వృక్షాల వనమున్నది . ఆ వనం బంగారు కాంతులతో 

ఆహ్లదకరమైన మృదువైన చల్లని గాలులతో నిండివున్నది

కదంబవనం దివ్యమైనట్టిది కదంబవృక్షం యొక్క ధ్యానం జ్ఞానాన్ని ఇస్తుంది 

అందుకే జ్ఞాన ప్రధాత గురువగు దక్షిణామూర్తి కదంబ వనంలో మర్రి చెట్టుక్రింద 

జ్ఞానముద్రలో వుంటారు . లలితా స‌హస్రం లో అమ్మవారిని కదంబవనవాసినీ అనీ కదంబకుసుమప్రియా అనీ కీర్తిస్తాం 

అంతటి దివ్యమైన ఈ వనాన్ని ధ్యానించి జ్ఞాన  సంపద పొందుదాం

కోరికలు దాటినపుడే జ్ఞానం లభిస్తుంది . అందుకే కోరికలు తీర్చే కల్పవృక్షవనాలు దాటిన తదుపరి జ్ఞాన సంపన్నమైన

 కడిమి చెట్లవనంలోకి అడుగుపెట్టాం 


తస్యామతిశిశిరాకృతి-

-రాసీనస్తపతపస్యలక్ష్మీభ్యామ్ ।

శివమనిశం కురుతాన్మే

శిశిరర్తుః సతతశీతలదిగంతః ॥ 

ఆ కదంబవనంలో తపశ్రీ  తపస్యశ్రీ (మాఘ ఫల్గుణ లక్ష్ములు )  అనే ఇరువురు శక్తులతో కలసి ఎల్లప్పుడూ మనకు మంగళములు 

(శివం ) కలిగించునటువంటి దిక్కులన్నింటిని చల్లబరుస్తున్నటువంటి  శిశిరఋతు దేవత ఉన్నారు 

శిశిర ఋతువు మనకు మంగళములు కలిగించుటలో ఔచిత్యమేమన మాఘమాసంలోనే మంగళాకారుడగు

 మహాదేవుని లింగోద్భవం 

ఇప్పటివరకు కాల స్వరూపుడగు మహాకాలుడిని ఆ కాల విభాగమైన ఆరు ఋతు దేవతలను దర్శించాం 

ఇప్పుడు ఇక్కడ ఈ వనంలో మరొక ప్రత్యేకమైన దేవతా దర్శనం చేసుకోబోతున్నాం  

తస్యాం కదంబవాట్యాం

తత్ప్రసవామోదమిలితమధుగంధమ్ ।

సప్తావరణమనోజ్ఞం

శరణం సముపైమి మంత్రిణీశరణమ్ ॥ 28 ॥

 చక్కని పరిమళాలు కలగలసిన  బంగారు కాంతులతో ప్రకాశించు ఆ కదంబ వనంలో 

మనోజ్ఞమైన ఏడు ఆవరణలతో కూడిన మంత్రిణీదేవి గృహం ను శరణుకోరుతున్నాను 


తత్రాలయే విశాలే

తపనీయారచితతరలసోపానే ।

మాణిక్యమండపాంత-

-ర్మహితే సింహాసనే సుమణిఖచితే ॥ 29 ॥

 ఆ గృహంలో బంగారు కాంతులనుఁ వెదజల్లుతున్న మెట్ల తో కూడిన మాణిక్య మండపం వున్నది 

ఆ మండపం మీద గొప్పవైన మణులతో చేయబడిన సింహాసనం   వున్నది 

బిందుత్రిపంచకోణ-

-ద్విపనృపవసువేదదలకురేఖాఢ్యే ।

చక్రే సదా నివిష్టాం

షష్ఠ్యష్టత్రింశదక్షరేశానీమ్ ॥ 30 ॥

ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఏడు ఆవరణలు చక్రంలో అమ్మవారు సదా నివసిస్తారు 

ఆ చక్ర స్వరూపం ఎలావున్నాడంటే బిందువు ఆ బిందువు ఆధారంగా త్రికోణం , దాన్నిఆధారం చేసుకుని 

ఐదు కోణాల చక్రం , దానిని ఆధారంగా (ద్విప  అంటే యేనుగు , అష్టదిగ్గజాలు ) ఎనిమిది కోణాల చక్రం

తరువాత (నృప అంటే చక్రవర్తి ...ప్రసిద్దికెక్కి నిత్య స్మరణీయులు పదహారుగురు) పదహారు దళాల పద్మం 

తదుపరి (వసు అంటే అష్ట వసువులు వీరిలో చిన్నవాడే భీష్మ పితామహుడు) ఎనిమిది  దళాల పద్మం

తదుపరి (వేద అంటే నాలుగు వేదాలు) నాలుగు దళాల పద్మం దీనిని ఆధారంగా చేసుకుని భూపురం (కురేఖాడ్యా )

ఇది అమ్మవారి చక్రం ధ్యానం చేసుకోతగినది సంకేత అక్షరాలతో చెబుతారు యంత్రాలను బీజాలను 

అవి సద్గురువు ద్వారా మనకు అందాలి తప్ప మనం వాటిజోలికి పోరాదు . మనకు అనుకూలమైనది 

ధ్యానము భగవన్నామ స్మరణము 

అలాంటి ఆ చక్రంలో తొంభై యెనిమిది అక్షరాలతో కూడిన మంత్రాధి దేవతగా అమ్మ మంత్రిణీదేవి సంచరిస్తూవుంటుంది 


ఎవరీ మంత్రిణీదేవి 

పేరులోనే ఉంది మంత్రి అంటే బుద్ది శక్తి ద్వారా కార్యాలను నిర్వహించేవారు 

బుద్దేశ్చ లలితాదేవ్యా శ్యామలా పరమేశ్వరీ వీణాశుక లసత్పాణిం ధ్యాతా సంగీత యోగిని అంటే వీణ ను చిలుకను ధరించి 

లలితా దేవి యొక్క బుద్ది శక్తి నుండి ఉత్పన్నమైన పరదేవత 

అందుకే లలితా సహస్రంలో చెబుతారు అమ్మ నామం :మంత్రిణీన్యస్త రాజ్యధూః 

ఈ తల్లినే రాజశ్యామల అంటారు . ఈ తల్లే  కాళిదాసు కు ప్రత్యక్షమై మహాకవిని చేసిన జ్ఞానస్వరూపిణి 

ఈ తల్లిని కీర్తిస్తూ మహాకవి కాళిదాసు ఆ తల్లి వున్న నివాసప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తారు 

జయజనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ

 బిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార

వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే     


అట్టి ఆ తల్లి యొక్క దివ్యమైన రూపాన్ని వర్ణిస్తున్నారు దూర్వాస మహర్షి . మనం నిత్యం ధ్యానించుకోవటానికి 

వీలుగా . విశేషించి మాఘ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రులు గా ప్రసిద్ధి . ఆ సమయంలో

అమ్మవారిని పదహారు నామాలతో స్మరిస్తూ ఈ విధంగా ధ్యానం చేసుకుంటే పిల్లలు పెద్దలు జ్ఞాన సంపన్నులవుతారు 

తాపింఛమేచకాభాం

తాలీదలఘటితకర్ణతాటంకామ్ ।

తాంబూలపూరితముఖీం

తామ్రాధరబింబదృష్టదరహాసామ్ ॥ 


కుంకుమపంకిలదేహాం

కువలయజీవాతుశావకవతంసామ్ ।

కోకనదశోణచరణాం

కోకిలనిక్వాణకోమలాలాపామ్ ॥ 


వామాంగగలితచూలీం

వనమాల్యకదంబమాలికాభరణామ్ ।

ముక్తాలలంతికాంచిత

ముగ్ధాలికమిలితచిత్రకోదారామ్ ॥


కరవిధృతకీరశావక-

-కలనినదవ్యక్తనిఖిలనిగమార్థామ్ ।

వామకుచసంగివీణావాదన-

-సౌఖ్యార్ధమీలితాక్షియుగామ్ ॥


ఆపాటలాంశుకధరా-

-మాదిరసోన్మేషవాసితకటాక్షామ్ ।

ఆమ్నాయసారగులికా-

-మాద్యాం సంగీతమాతృకాం వందే ॥ 


కానుగ లేదా తమాల వృక్షం వలే నీల కాంతులు అమ్మవారి వర్ణాన్ని చెబుతున్నారు 

నల్లని వర్ణం అంటే ఆ నలుపు  దూరమునుండి చూస్తే ముదురు ఆకుపచ్చ ఎలా అనిపిస్తుంది 

అలాంటి నలుపు ఆ కాంతితో ప్రకాశిస్తూ చెవులకు బంగారు తాటి కమ్మలతో చేయబడిన ఆభరణాలు 

ధరించి తాంబూలాన్ని సేవిస్తూ ఎర్రని పెదవుల నడుమ చిరునవ్వుల వెన్నెలలు కురిపిస్తున్న తల్లికి నమస్కారము 


దేవతా స్త్రీ సమూహపు అర్చన చేత దేహమంతా అలదబడిన కుంకుమ తో ప్రకాశిస్తున్నది , బాల చంద్రుని 

శిరముపై దాల్చి వున్నది  పద్మముల వంటి పాదములు  కోకిల కువకువ లవంటి మధురమైన పలుకులతో 

కూడిన తల్లికి నమస్కారము 


ఎడమ భుజం మీదుగా ముందుకు జారవిడిచి కొప్పుతో భాసిల్లున్నది , 

వనములయందలి సువాసనాభరితములైన పూలతో కదంబ కుసుమాలతో కూడిన మాలికలు ధరించినట్టిది 

ఫాలభాగం పై లలంతిక అను ఆభరణం తో ప్రకాశించునది చెక్కిళ్ళపై చిత్రకమను అలంకరణతో వెలుగొందునది 

అగు తల్లికి నమస్కారము 


అవ్యక్తమైన మధుర ధ్వనులతో సకల వేద

 శాస్త్రాల అర్ధాన్ని పలుకుతున్నటువంటి చిలుకలను చేతి యందు 

ధరించి వీణను మీటుతూ ఆ వీణ యొక్క సుమధుర ధ్వనులను ఆస్వాదిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో ఆనంద 

పారవశ్యురాలైన తల్లికి నమస్కారము 


ఎర్రని వస్త్రాలు ధరించి సౌందర్య దివ్యభావనలను ప్రసరింప చేయు కనులతో , వేద శాస్త్రముల యొక్క 

సారభూతమైనట్టిది జ్ఞాన స్వరూపిణి  సంగీత విద్యకు తల్లి అయిన శ్యామలాదేవికి నమస్కారము 


ఆ తల్లి షోడశనామములు (పదహారు నామాల ప్రత్యేకత ఏమంటే , మనకు పదిహేను తిథులు అవే 

 పునరావృతమవుతూవుంటాయి వృద్ధి క్షయాలతో అలాంటి వృద్ధి క్షయాలు లేని పరమాత్మయే పదహారో 

కళ ఇది నిత్యము సత్యము.  అందుకే పరమాత్మ ని షోడశనామాలతో షోడశోపచారాలతో పూజిస్తాం )


సర్వాకాల సర్వావస్థలయందు చెప్పదగినదే భగవన్నామం . కొన్ని ప్రదేశాలలో శబ్దం బయటకు రాకుండా 

మనసుతో మననం చేసుకోవాలి అంతకు తప్ప వేరే నియమాలు అవసరం లేదు 

శ్రీకారాలు ఓంకారాలు నమఃకారాలతో నిమిత్తం లేకుండా నోరారా పలుక దగినదే భగవన్నామం 

శ్యామలా షోడశనామములు 

సంగీతయోగినీ   శ్యామా    శ్యామలా  మంత్రనాయికా 

మంత్రిణి  సచివేశీ   ప్రధానేశీ  శుకప్రియా  వీణావతి 

వైణికి   ముద్రిణి   ప్రియకప్రియా   నీపప్రియా కదంబేశీ

కదంబవనవాసినీ   సదామదా

Sunday, January 4, 2026

రాజాధిరాజాయ


 రాజాధిరాజాయ యదుకులభూషణాయ

యశోదా నందనాయ మహిత మంగళం

చిరుదరహాస వదనాయ రాధా మనోహరాయ
శ్యామసుందరాయ మహిత మంగళం

త్రిభంగిరూపాయ త్రైలోక్య నాథాయ
త్రిపురాసురసంహారివర్ధనాయ మహితమంగళం

విరజా ప్రియాయ వేణుగానలోలాయ
విరించి జనకాయ మహిత మంగళం

కాళిందీ ప్రియాయ కాళింద మర్థనాయ
కృష్ణ మాన సంరక్షకాయ మహితమంగళం

పూతనప్రలంబాది భక్తజనోద్ధారకాయ
పార్వతీ ప్రియసోదరాయ మహిత మంగళం

అవనీ ధరాయ అర్జున సఖాయ
ఆనందవర్ధనాయ మహిత మంగళం

గోవర్ధనోద్ధారణాయ గోగోపగోపీ మానసహరాయ
గోవిందనామప్రియాయ మహిత మంగళం

లక్ష్మీకిరణహృదయ రాసమండలవాసాయ
రాధికాపతే మహిత మంగళం మహిత మంగళం
మహిత మంగళం

రాజాధిరాజాయ యదుకులభూషణాయ యశోదా నందనాయ మహిత మంగళం 

అర్థం: రాజులకు రాజు అయినవాడికి (సర్వాధికారికి),యాదవ వంశానికి అభరణం వంటివాడికి.యశోదమ్మ ముద్దుల కొడుకైనవాడికి గొప్పదైన శుభం (మంగళం) అగుగాక.

 చిరునవ్వులు చిందించే ముఖం కలవాడు, రాధా దేవి మనసును దోచుకున్నవాడికి,నీలమేఘ శ్యాముడై, అత్యంత సుందరుడైన వాడికి గొప్పదైన శుభం అగుగాక.

 వేణువు ఊదే సమయంలో శరీరాన్ని మూడు చోట్ల వంచి నిలబడే అందమైన రూపం కలవాడికి , మూడు లోకాలకు అధిపతి, త్రిపురాసురుడిని సంహరించిన పరమశివుడికి ప్రీతిపాత్రుడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.

విరజాదేవికి ప్రియుడు, వేణుగానం పట్ల ఆసక్తి కలవాడు, బ్రహ్మదేవునికి తండ్రి అయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక

  యమునా నది అంటే ఇష్టం కలవాడికి (లేదా కాళింది అనే భార్యకు ప్రియమైన వాడికి), యమునా నదిలోని కాళింగుడనే పాము గర్వాన్ని అణిచినవాడికి (కాళీయ మర్దనం చేసినవాడికి), ద్రౌపది (కృష్ణ) మానాన్ని రక్షించినవాడయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక 

పూతన, ప్రలంబాసురుడు వంటి తన భక్తులను ఉద్ధరించినవాడు, పార్వతీదేవికి ప్రియమైన సోదరుడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక .

భూమిని ధరించినవాడు, అర్జునుడికి స్నేహితుడు, ఆనందాన్ని వృద్ధి చేసేవాడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.

గోవర్ధనగిరిని ఎత్తినవాడు, గోవులు, గోపకులు, గోపికల మనస్సులను హరించేవాడు, గోవింద అనే నామం పట్ల ప్రీతి కలవాడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.

లక్ష్మీదేవి కిరణాల వంటి హృదయం కలవాడు,  రాసమండలంలో నివసించేవాడు, రాధికాపతి అయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక, గొప్పదైన శుభం అగుగాక, గొప్పదైన శుభం అగుగాక.

Monday, December 8, 2025

రమణీయ

 అత్యద్భుత రమణీయ దీప్తిలక్ష్మీ

అనర్ఘ్యరమణీయ కాంతిలక్ష్మీ

మణిదీప్త విలాసహాసలక్ష్మీ
హృదయరాగ రంజిత మనోజ్ఞలక్ష్మీ

ఆకాశరాజు కంఠహారమౌ హరివిల్లులా
భూకాంత సిగ లో పూచిన హసితచంద్రలక్ష్మీ
అందుకో మీకై అల్లిన అభినందన చందన అక్షరలక్ష్మి

ఓ అత్యద్భుతమైన, రమణీయమైన కాంతులతో వెలిగిపోయే లక్ష్మీ! నీవు వెలకట్టలేని సౌందర్య రాశివి.

రత్నాల వంటి ప్రకాశంతో, విలాసవంతమైన నవ్వులు చిందించే ఓ లక్ష్మీ! హృదయంలోని ప్రేమ అనే రాగంతో రంజిల్లే మనోహరమైన దానివి నీవు.

ఆకాశరాజు మెడలోని హారమైన ఇంద్రధనస్సు లాగా, భూదేవి కొప్పులో పూసిన నవ్వుల చంద్రుడి లాగా ప్రకాశించే ఓ లక్ష్మీ!

మీ కోసం ప్రత్యేకంగా అల్లిన, చందనం వంటి చల్లని ఈ అభినందన అక్షరాల కవితను అందుకోండి.


Friday, December 5, 2025

దేహ బృందావని

 


దేహ బృందావని లో  మానస రాస మండలమున 

గోపికాభావమొందిన బుద్ది పలికెడి శ్రీకృష్ణ పల్కుల 
నాలకించి రాధాశ్యాములాడిరి ఆనంద నృత్యహేల 
నా దేహంబెల్ల క్రిష్ణ ప్రేమపారవశ్యజల్లుల తడపగ 

కవితా భావం (Meaning):

ఈ కవిత ఒక భక్తుని యొక్క అంతర్గత ఆధ్యాత్మిక అనుభూతిని అద్భుతమైన రూపకాలతో వివరిస్తుంది. ఇది కేవలం బాహ్య పూజ కాదు, శరీరమే దేవాలయంగా మారిన స్థితి.

  1. దేహ బృందావనిలో మానస రాస మండలమున: కవి తన భౌతిక శరీరాన్నే పవిత్రమైన 'బృందావనం'గా భావిస్తున్నారు. తన మనస్సును శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిపాడిన 'రాస క్రీడా స్థలం' (రాస మండలం) గా ఊహించుకుంటున్నారు. అంటే, మనసు దైవ చింతన అనే నాట్యానికి వేదికైంది.

  2. గోపికాభావమొందిన బుద్ది పలికెడి శ్రీకృష్ణ పల్కుల: సాధారణంగా తర్కంతో ఆలోచించే 'బుద్ధి', ఇక్కడ తర్కాన్ని వదిలి, శ్రీకృష్ణునిపై అనంతమైన ప్రేమ కలిగిన 'గోపిక' భావాన్ని పొందింది. అలా పవిత్రమైన బుద్ధి, ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణుని మాటలను (దైవ జ్ఞానాన్ని) పలుకుతోంది.

  3. ఆలకించి రాధాశ్యాములాడిరి ఆనంద నృత్యహేల: ఆ దైవ వాక్కులను విని, తనలోని జీవాత్మ (రాధ) మరియు పరమాత్మ (శ్యాముడు/కృష్ణుడు) ఒక్కటై, ఆనందంతో కూడిన దివ్యమైన నాట్యాన్ని చేస్తున్నారు.

  4. నా దేహంబెల్ల క్రిష్ణ ప్రేమపారవశ్యజల్లుల తడవగ: ఆ అంతర్గత దివ్య నాట్యం వల్ల కలిగిన ఆనందం ఎంతటిదంటే, అది కృష్ణునిపై ప్రేమ అనే పారవశ్యపు జల్లులుగా మారి, కవి శరీరం మొత్తాన్ని తడిపి ముద్దచేస్తోంది. ఇది అత్యున్నతమైన భక్తి పారవశ్య స్థితి.


కవితతో కూడిన చిత్రపటం:

మీరు కోరినట్లుగా, ఈ కవితలోని భావాన్ని ప్రతిబింబించేలా ఒక చిత్రాన్ని రూపొందించి, అందులో ఈ కవితను పొందుపరచడం జరిగింది.

చిత్ర వివరణ: ఈ చిత్రంలో ఒక వ్యక్తి ధ్యాన ముద్రలో ఉన్నట్లు, అతని శరీరమే ఒక బృందావనంగా మారినట్లు చూపబడింది. అతని హృదయ స్థానంలో 'మానస రాస మండలం' ప్రకాశిస్తోంది. అక్కడ రాధాకృష్ణులు ఆనంద తాండవం చేస్తున్నారు. ఆ నాట్యం నుండి వెలువడిన కృష్ణ ప్రేమ అనే కాంతి జల్లులు ఆ వ్యక్తి శరీరం మొత్తాన్ని ఆవరించి, పారవశ్యంలో ముంచెత్తుతున్నట్లుగా ఈ చిత్రం రూపొందించబడింది.


(Google Banana -Picture)

Tuesday, December 2, 2025

మార్గశీర్ష శుద్ధ త్రయోదశి

 మార్గశీర్ష శుద్ధ త్రయోదశి


మార్గశిర మాసమే ప్రత్యేకం. శ్రీకృష్ణమాసం. శివ పార్వతుల కళ్యాణం జరిగిన మాసం. శరవణ భవుడు ఉదయించిన మాసం . దత్తాత్రేయ గురువరేణ్యుడు జనించిన మాసం. శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అర్జునుని ముఖతా గీత భోధించిన మాసం  

అట్టి ఈ ‌మాసంలో శుద్ధ త్రయోదశీ ప్రత్యేకమైనది. ఈ రోజు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు సువర్చల ను హనుమకు ప్రసాదించిన రోజు.  సువర్చల అంటే చక్కని వర్చస్సు కలిగినది అని. అంటే చక్కని ముఖకాంతి ఎవరికి వుంటుంది. ఎవరికి సుజ్ఞానం
వుంటుందో వారికే సువర్చస్సు వుంటుంది. జ్ఞాన ప్రదాత అయిన సూర్యభగవానుడు హనుమకు చక్కని జ్ఞానం ప్రసాదించిన రోజు ఈరోజు. సువర్చస్సుతో కూడినవాడు కనుకే హనుమ అందరికీ ఇష్టుడు.
(
అలాగే ఇదేరోజు హనుమ అశోకవనంలో శింశుపా వృక్షం కింద సీతమ్మను దర్శించిన రోజు. శ్రీరామ వియోగ దుఃఖభారంతో వున్న సీతమ్మకు రాముని అంగుళీయకాన్నిచ్చి సంతోషం కలిగించిన రోజు ఈరోజు. అందుకే హనుమను ఉద్దేశించి సీతమ్మ పలికిన ఈ పలుకులే మహామంత్రమై మనలను ఎల్లవేళలా కాపాడతాయి.

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా | 
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ || 

ఓ కపిశ్రేష్టుడా కార్యములను సమర్ధవంతంగా నిర్వహించుటకు నీవే అత్యుత్తమ ప్రమాణము(ఉదాహరణ). ఓ హనుమా నీవే ప్రయత్నపూర్వకంగా మా దుఃఖములను తొలగించుము.

మన హృదయమనే అశోకవనం (ఎల్లప్పుడూ ఆనందంగా వుండటం హృదయం యొక్క సహజ స్వభావం ) లో నివసించే చైతన్యస్వరూపమైన శక్తి  మోహమనే రావణమాయ తో కప్పబడి మన మనసు వివిధమైన వ్యాకులతలకు లోనవుతుంది . 

సుజ్ఞానమనే శ్రీరామ భక్తిని ఆశ్రయించిన బుద్ధికుశలత అనెడి కార్యశీలుడగు హనుమ  తన ప్రయత్నబలంచేత మన హృదయకుహరాన్ని కప్పివేసిన మోహపురావణుడిని తొలగించి హృదయ అశోకవనిలో కొలువైవున్న చైతన్యస్వరూపాన్ని ప్రజ్వలింపచేసుకుంటే ఆ దేహమే అయోధ్య . ఆ మనోమందిరమే శ్రీరామ అంతఃపురం . 

రోజూ ఈ భావం చేస్తూ సీతమ్మ చేత ప్రసాదించబడిన ఈ శ్లోక మంత్రాన్ని మూడు సార్లు మననం చేసుకుంటే రోజంతా సుఖప్రదం ఆనందమయం.  

Tuesday, November 25, 2025

Friday, November 14, 2025

క్రిష్ణ

 నిరంతరముగా క్రిష్ణ నామమును

 క్రిష్ణ లీలా మహిమను జపించిన
మాయదుమ్ము కమ్మిన హృదయ 
దర్పణం శరత్కాల పూర్ణిమా బింబమగు

ఆ నామం ప్రాపంచికవిషయ బడబాగ్ని కి దగ్ధమవుతున్న హృదయవనాన్ని చల్లార్చు 
చల్లని చందనపు వానజల్లు  

ఆ నామం,  భగవత్ జ్ఞానాన్ని దాచుకున్న   కలువ హృదయాన్ని వికసింప చేయుచూ ప్రవహించు చంద్రకాంతి

ఆ నామం, ఓ మనసా  నిను
ఆనంద తరంగాలలో లోతుగా మునకలెత్తించు

నిరంతరం క్రిష్ణ నామాన్ని జపిస్తూ,
అడుగడుగునా క్రిష్ణనామ అమృతాన్ని రుచి చూస్తూ,

అలసిపోయిన ఆత్మలకు ఓదార్పు
 స్నానం చేయించు క్రిష్ణ నామంలో స్నానం చేస్తూ

ప్రతి క్రిష్ణ నామంలో క్రిష్ణశక్తి నివసిస్తుంది.

కాలాలు నిర్ణయించబడలేదు, ఏ ఆచారాలు అవసరం లేదు  క్రిష్ణనామ జపానికి,

ఓ క్రిష్ణా నీ దయ చాలా విశాలమైనది.
అని పలికెనీ రాధానామ విరహాంతరంగుడు బంగరు వన్నె మెరయు లక్ష్మీ దాసుడా చైతన్యమహాప్రభు నిద్రాణమౌ మా క్రిష్ణచైతన్యము మేల్కొలప