ఎన్నికల నగారా మ్రోగింది రాజకీయ జంతువుల వింత విన్యాసాలకు మరోసారి తెర లేచింది
అమ్మ దయ అంటూ , వేల సంవత్సరాలనుండి భారత దేశానికి సర్వం సహా చక్రవర్తులు నివసించే ప్రాంతం ఈ హస్తిన ఏ అన్న నిజాన్ని మనకు మళ్ళి మళ్లీ గుర్తు చేస్తు, ఢిల్లీ గల్లిల్లో నే కాక అంతర్జాతీయ విఫణి లో ఆంధ్రుల పరువును తాకట్టు పెట్టిన నూరు వసాంతాలు నిండిన భస్మాసుర హస్తం (భస్మాసురులు…..……ఆంధ్రులు, హస్తం మాత్రమే కాన్గీయులది)
ఇది సత్యమో …….అసత్యమో
ఆంధ్రులు గొర్రెల మంద అన్న ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించి,మదరాసీలుగా ముద్రపడ్డ జాతికి సొంత గుర్తింపు నిచ్చి, జనులకు రాజకీయ స్పృహనిచ్చి, తరువాత కాలం లో గతి తప్పి పల్లెల ప్రాముఖ్యం విస్మరించి, రైస్ పండించే రైతు కన్న, కామన్ సెన్స్ లోపించిన కంప్యూటర్ మిన్న అనుకున్న కళ తప్పిన సైకిల్
అన్నం బదులు అందరికి కంప్యూటర్ చిప్స్ తినిపిద్దమనుకున్నరేమొ
లక్షం పెద్దది అయినప్పుడు ప్రణాళిక కూడా ఎంతొ ముందుగా సిద్దం చేసుకోవాలి. ఇది ముందుగానే పసి గట్టి వారి రక్తాన్ని వారి కళ్ళను వారికే ఎర వేసి, తెలుగోళ్ళూ వెర్రి వెన్గళాయ్లోయ్ చూపిస్తాం చూడండి అంటూ ముందుకొస్తుంది ఇంకా గుర్తు తెలియని కుటుంబ రాజ్యం
అహా ఆంధ్రులకు మరో బీహార్ కనిపిస్తుంది……….కొంచెం మార్పు…… బావ……..రబ్రీ దేవి. బావ మరిది………..లాలూ ప్రసాద్ యాదవ్
ఇవి కాక రజాకార్ల రాజ్యం మళ్ళి తెస్తామంటు వురకలు వేస్తున్న గులాబీ కారు, కూరలో కరివేపాకు వంటి కామ్రేడ్స్ ఇవన్ని కాక నేతి బీరకాయలో నెయ్యి వెదకిన చండం గా, సమాజంలో లోపించిన నైతిక విలువలను, రాజకీయాలలో వెదకుతూ, ప్రాధమిక పాటశాల అయిన తల్లి ఒడిలోనే మానవతా విలువలు మృగ్యమైన సత్యం విస్మరించి, అదృష్టం కలసి వస్తుందేమో అని ఎదురు చూస్తున్న తోడేళ్ళ గుంపుకు నాయకత్వం వహిస్తున్న అమాయక జీవి ఒక వైపు .
నెల నాళ్ళ వినోదమ్……….పంచ వసాంతాల పాట్లు (ఎవరి అభిప్రాయం వారిది)