Thursday, July 27, 2023

వానాకాలం నాడు నేడు  ఆకాశపు చెలికాడు చిటపట చినుకులు రాలుస్తుంటే  సూరీడి చురుక్కు చూపులతో వేడెక్కి వేదన పడుతున్ న భూకాంత ఎద చెమ్మగిల్లి వెలువరించే గంధపుగాలుల ఆస్వాదన లో నా మేని పులకరించే నాడు  ఎండ వేడిమికి పుడమి ఎండి  వానొచ్చే సమయమొచ్చిన చినుకురాలక రైతు గుండె ఎండి  ఇరువురి వేదన  వరదలై  నిలువ నీడలేక  ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణుల చూచి మనసు మూగపోయే నేడు    ఇంటి చురుల జాలువారి కాలువ కట్టిన వాననీటిలో కాగితపు పడవనెక్కి వేయించిన కారపు వేరుశనగ గుళ్లను గుటుక్కుమనిపిస్తూ పక్కింటి పాప చేయి పట్టి చిందులేసి మురిసిపోతి నాడు  రహదారులలో ధార లా పారుతున్న జలధారలో పొంగిపొరల ుమురుగులో తెలియని దారులలో మరపడవల పై తాపోజాలక పక్కనోడినీ పోనీయక చిరాకు సణుగులు తింటూ సాగిపోయే అయోమయపు జీవుల చూచి జాలిచెందితి నేడు 

No comments: