Monday, June 17, 2013

మెరుపు వాన కావి చీర చుట్టుకున్న ఆకాశ కాంత నడుముకు చుట్టుకున్న వడ్డాణపు కాంతి మెరుపు చెలి నగుమోము పై పూచే చిరు దరహాస చంద్రిక మెరుపు దొండ పండు వంటి పెదవులపై పూచే ముత్యపు బిందువులను తాకిన సూర్య కాంతి స్పందన మెరుపు విచ్చుకున్న పెదవుల నడుమ తళుకు మంటున్న ముత్యాల పలువరుస పూయించే కాంతి మెరుపు గులాబీ రెక్కల వంటి చెలి బుగ్గల సిగ్గు మరక మెరుపు నల్లని సిగలో తురుముకున్న మల్లెల సొబగు మెరుపు నెచ్చెలి ఆలోచనలతో హృదయాకాశం లో వెల్లివిరిసే ఆనందాతిశయమ్ మెరుపు
హర నీ కనులతో కాంచిన హరి వైభవం పోతన మనసును తాకి భాగవత కధా సుధగా జాలు వారే కద శివ నీ స్మరణలో నలిగిన రామ నామ రసం తులసీదాసు హృదిని చేరి రామ చరిత మానస మయ్యే కద భవ హరి భక్తుల వైభవమెరిగిన నీ మానసం హనుమ గా మారి భక్త జనులపాలిట కామదేనువయ్యే కదా శంకర విష్ణు స్మరణ ఫలిత మెరిగిన నీ జ్ఞానం ఆది శంకరులు గా మారి గోవింద నామ ప్రవాహ మొనర్చె కదా సాంబ సదా శివ నారాయణ హృదయమెరిగిన మీ హృదయం గరళాన్ని పానం చేసి లోక రక్షకుడివై నిలిచే కదా క్రిష్ణ శివుని సామర్ధ్య మెరిగిన నీ మేధస్సు అర్జునుడి అమ్ముల పొదిలో పాశుపతమై నిలిచే కదా నారాయణా మన్మధ వైరి మనస్సేరింగిన మీరు నారాయణి ని హరుని అర్ధాంగి ని చేసి మురిసితిరి కదా హరి హర ఒకరిపట్ల నొకరు కడు ఆత్మీయ భావంతో మీరుండ వీరు గొప్పంటే కాదు వారు గొప్పని భేధ భావం చూపే మా మనస్సుల మాయ పొరలు తొలగించుమా హరిహరా