Monday, February 25, 2013

నిజం నీవు నీడను నేను

నిజం నీవు నీడను నేను నిశ్శభ్దమ్ నేను ఛేదించే వేణు గాన తరంగం నీవు మౌనం నేను ఆహ్లాదం కలిగించే మదుర భాషణ నీవు తీరం నేను నిన్ను తాక ఎగిసిపడే కెరటం నీవు మండించే వడగాల్పు నేను సేద తీర్చు శీతల పవనం నీవు ఉదయ సంధ్యలో భానుని తొలి కిరణం నేను నా స్పర్శ తో వికసించే నవ కమలం నీవు మలి సంధ్యలో చందురుని అమృత కిరణం నేను పరవశించే కలువ బాలవు నీవు ధీర గంభీరంగా సాగే సముద్రుడను నేను నన్ను చేర పరవళ్ళు తొక్కుతూ పారే నిర్మల నది తుంగ వు నీవు మాదురీ మదురిమల గ్రోల పరుగులుతీసే తుమ్మెద ఝూంకారం నేను ఎద మదువుని పంచి హృదయంలో బందీం చే పూబాలవు నీవు తొలకరి చిరు జల్లు నేను నా తాకిడి కి తన్మయత్వం తో నన్నలుముకునే మట్టి గంధపు వాసన నీవు నిన్ను తాక వచ్చు మలయ మారుతం నేను నాలో పరిమళాలు నింపే మల్లి వి నీవు ప్రేమ తాపంతో ఎగసిపడే అలవు నీవు బంధించే గట్టును నేను చిరు గాలి స్పర్శకు చిగురుటాకులా వణికే అధరమ్ నీవు ని అధర స్పర్శ కోరి పెదవుల పై బాగాన నిలిచిన స్వేద బిందువు నేను చిలిపితనం, ప్రేమ కలబోసిన అమాయకపు అల్లరి పిల్లవు నీవు ని అల్లరి నా ఎదలో జన్మ జన్మలకు ఝుల్లరి చేయలని కోరుకునే ప్రేమ పీపాసి ని నేను నిజం నీవు నిన్నంటే నేను

Friday, February 15, 2013

హరి హర ! ఓ చిన్న విన్నపం

హర నాలోని అహంకారాన్ని నీవు స్వీకరించు
 వినయమనే అమృత బిందువులు నాకు అందించు 
 హరి సంసారమనే సముద్రంలో నీవు విహరించు 
 శాంతం అనే సౌధంలో నన్నుంచు
 శివ నాలోని మదనుడిని నీవు తీసుకో 
 నీ వైరాగ్య భావన నాకు ఇవ్వు
 క్రిష్ణ నాలోని అరిషడ్ వర్గమనే ఆరు తలల పాముపై నీవు నాట్యమాడు
 నీ పాద పద్మముల మకరందం గ్రోలు మనస్సునివ్వు శంభు: అమంగళ మగు ఆలోచనలను హరించు మంగళకరమగు ఆలోచనలను ప్రేరేపించు 
 ధరణీధర సకల జీవులలో నిన్నే కాంచు కనులనివ్వు 
 మా భారం వహించు మమ్మను అనుగ్రహించు

Thursday, February 7, 2013

నీ పాద పద్మముల వైపు నా గమ్యం గమనం

నూనూగు మీసాల నూత్న యవ్వన కాలం నుండి నడి సంధ్యకు కాయం కదిలినా ఊహల సౌందర్య లోకం నుండి అనుభవాల రాపిడిలో కాయం పండినా మనసు మాత్రం పచ్చితనం వీడలేదు పుండరీక వరదా !
అలవికాని ఆలోచనలతో సతమతమవుతూ అందుకోరాని వాటికి ఆరాటపడుతూ ఉహాలోకంలో విహరిస్తూ వాస్తవంలో నిట్టూరుస్తూ నీ ఉనికిని మరచి కల్లోల జగత్తులో కాయం కరిగిపోతున్నది అజామిళోద్దారక ! పూల మకరందం కోసం అర్రులు చాచు తుమ్మేదలవలె దీపపు కాంతుల వైపు పరుగులుతీయు చిమ్మెటల వలే కాంతా కనకాదులకై పరితపిస్తూ శాంతిని విడచి విలపిస్తూ పట్టవలసిన నీ పాదాలు పట్టలేక పతిత తీరాల వైపు పయనిస్తున్నది పురుషోత్తమా ! ఇంతటి కారు చీకటిలో కల్లోల కడలికి ఆవలి వైపున మిరుమిట్లు గొలిపే ఆశా దీపం వెలిగిపోతున్నది తరచి తరచి చూచిన మది కాంచెను కనకపు కాంతులతో లలిత లావణ్య ముగ్ద మనోహరం గా ప్రకాశిస్తున్న నీ పాద పద్మం భక్తి అనే పడవలో నీ నామమనే తెడ్డు ఊతంగా ఇచ్చి నా గమ్యం గమనం నీ వైపుకు త్రిప్పుకో పద్మ నాభుడా !

Wednesday, February 6, 2013

అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు


అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో