నీలిమేఘ శ్యామా …..
కృష్ణుడి పేరు …………దట్టమైన నల్లమబ్బు వంటి వర్ణం కలవాడా
ఏమిటి మేఘానికి భగవంతుడికి సంబంధం
నీటితో నిండియున్న మబ్బు నల్లగా వుంటుంది . అది తనలోని నీటి ధారలను
వర్షించగానే తెల్లగా తేలిపోతుంది . ఇక ఇవ్వటానికి నాదగ్గర ఏమి లేదే అని
వెలవెలబోతుంది
అలాగే భగవంతుడు కూడా …..మేఘంలో నీరు ఉన్నట్లే కృష్ణుడిలోను
కృపాజలం నిండుగా వుంటుంది . ఆయన కూడా మనపై దయావర్షాన్ని కురిపిస్తాడు
మేఘం కొండలలో వర్షిస్తుంది . అక్కడ కురిస్తేనే ఆ నీరు
నదిగా మారి మనకు ప్రయోజనం కలిగిస్తుంది
అందుకే కృపాజలనిది వెంకటనాధుడు ఏడుకొండలపై కొలువుండి మనపై
తన దయావర్షం కురిపిస్తున్నాడు
ఏదైనా ప్రత్యేకమైన కోరికలతో భగవంతునకు నమస్కరించేవారు
ఎటువంటి కోరికలు కోరకుండానే నమస్కరించుకునేవారు
వీరిలో ఎవరు తెలివైనవారు ? ఎ కోరికలు కోరని వారు
మన పరిజ్ఞానం ఎంత ? మనకు నిజంగా ఏది అవసరమో మనకు తెలుసునా
మనం కోరే కోరిక నిజంగా మనకు పూర్ణానందం కలిగిస్తుందా
అదే మనమేమి కోరకుంటే మనకు ఏది అవసరమో తనే నిర్ణయించుకుని
వెంకటనాధుడు మనపై దయావర్షం కురిపిస్తాడు
అదే మనం కోరుకుంటే అంత వరకే ఇచ్చి , అయ్యో వీడికి ఎంతో ఇద్దామనుకున్నాను
కాని నాకింతే చాలని అంటున్నాడే అని నీరు వెలసిన మేఘం లా ఆ దయాసముద్రుడు
వెలవెల బోతాడు
మరి మనం ఆయన కృపాజలంలో సంపూర్ణంగా తడిసి ముద్దయ్యేందుకు ప్రయత్నిద్దామా !
(పెద్దల అనుగ్రహభాషణల ఆధారంగా)--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA
1 comment:
అయ్యా, అది "నీలిమేఘశ్యామా" కాదు. "నీలమేఘశ్యామా. అది నీలి (బ్లూ) కాదు. నీల (నలుపు). విష్ణువు కాని, రాముడు కాని, కృష్ణుడు కాని .... నల్లని వారే. సినిమాలల్లో చూపించే బ్లూ కలర్ కాదు.
Post a Comment