Wednesday, September 17, 2008

Spurti


ఒక ఆదివారపు ఉదయం………..చుట్టుప్రక్కల గమనించ కాస్త తీరిక దొరికిన


ఇంటి ముందు ఉన్న బావి ఒరల్లొ పుట్టుకు వచ్చిన ఒక చిన్ని మొక్క నా దృష్టిని ఆకర్షించింది. దానిని చూస్తే నాకు జాలి కలిగింది… ఆ బావి పై బాగం ఒక జల్లెడ తో ముయబడి ఉంది. …

చీకటి తో నిండిన నూతిలో…ఒంటరిగా

కొద్ది రోజుల తరువాత మరల నా దృష్టి ఆ చిన్ని మొక్క వైపు మళ్లింది. ఈసారి దాని పట్ల మరింత సానుభూతి కలిగింది. కారణం ఆ మొక్కకు పసుపు వర్ణం లో, నయనందకరం గా ఒక చిన్ని పుష్పం పూచింది. ఆది ఆ బావిలో ఇనుప జల్లెడ కింద దాగి ఉంది.

కానీ ఏమీ లాభం…రంగు రంగుల సీతాకొక చిలుక యొక్క సుతిమెత్తని స్పర్శను ఆస్వాదించలేదు ……..భానుని లేలేత కిరణాల చైతన్యాన్ని పొందలేదు

నలుగురికీ……..వెలుతురుకు దూరం గా

కొన్ని రోజుల తరువాత………. చిరుగాలికి వయ్యారంగా అటు ఇటు వుగుతు….తుమ్మెదల ఝూంకారాపు సంగీతానికి పరవసిస్తు………సూర్య కాంఠికి పసిడి వర్ణం లో మేరసిపోతున్న పూల బాలలథొ

చీకటిని చీల్చుకుని…….ఇనుప జల్లెడ ను ఛేదించుకుని……నా వైపు చిరునవ్వులు ఓలుక్తూ….సగర్వం గా చూస్తుంది……….. నీ సానుభూతి నాకు అవసరం లేదు సుమా అంటూ. అహా! ఒక చిన్ని మొక్క ఎంతటి చక్కని సందేశం ఇచ్చింది.

ఒక చిన మొక్క అననుకుుల వాతావరణాన్ని సైతం లెక్క చేయక, దరదంగా పైపైకి ఏదుగుతుంటే……….

మరి మనం………

తల్లి గర్భం లో ఆ చీకటి గుహలో, దుర్గన్ధ భూయిష్టామ్మైన ఆ ప్రాంతం లో ఉంటూ కూడా శిశువు రోజు రోజుకు ఏదుగుతూనే ఉంటుంది……

కొంతకాలం తరువాత ఒక అందమైన ప్రపంచం లోకి అడుగుపెడతామన్న ఆశ తో కానీ ఆ ఆశ, ఆ ద్రుడ సంకల్పం పుట్టిన తరువాత కనుమరుగవుతున్నాయి.

జీవితం విలువైనది. ఆ చిన్ని మొక్క నుండి పాటం నేర్చుకుందాం…….మనలో నిగుడంగా ఉన్న శక్తి సామర్ధ్యాలను వెలికి తీద్ధాం.

ప్రపంచమంతా…….నీ వల్ల కాదంటున్న……చెక్కుచేదరని మనోదైర్యం తో మన లక్ష్యం వైపే సాగుదామ్

ఆశ అనే చిరు దీపం తో నైరాస్యపు చీకటిని పారద్రోలుదాంద్రుద్ సంకల్పం తో సమస్యలనే సంకెళ్లను చెదిద్ధమ్ అననుకూల పరిస్థితిని సైతం లెక్క చేయక …….ఎగిరే గువ్వలను……..ఎదిగే మొక్కలను……స్పూర్తి గా తీసుకుందాం వాటికే అంత ఆత్మ స్థైర్యం ఉంటే, వాటికన్నా ఉన్నతమైన మనలో ఎంతటి శక్తి సంర్ద్యాలు ఉండాలి….. వాటిని వెలికితీద్దమ్………

based on original post: http://startrekker.rediffiland.com