భగవంతుని నామాలలో అతి ముఖ్యమైనది .......గోవింద నామం. ఈ నామ ప్రశస్త్యమ్ తెలిపే ఒక సంఘటన తెలుసుకున్దామ్.
కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కృష్ణుడిని సహాయం కొరుతున్ది...
ఆ సమయం లో ద్వారక లో కృష్ణుడు రుక్మిణి దేవి తో ముచ్చాట్లాడుతుంటాడు.
ఇక్కడ ద్రౌపది ఆర్తి తో ..........శంఖ చక్ర గధాదరా అని పిలుస్తుంది.
కృష్ణుడు నన్ను కాదేమో అనుకున్నాడు. కారణం భగవంతుని నివాస స్థానమైనా గోలొక బృందావనం లో నివసించే అర్హత పొందిన భక్తులు కొంత భగవంతుని సారూప్యతా కూడా పొందుతారు. వారు కూడా శంఖ చక్ర గధాదరులై వుంటారు. కనుక వారిలో ఎవరినైనా పిలిచి ఉంటుందేమో అనుకున్నాడు.
............ద్వారకా నిలయా అని పిలుస్తుంది ఈసారి కూడా ఇంకెవరో అనుకుంటాడు కృష్ణుడు.
కారణం .... ద్వారక లో ఎంతమంది మహానుభావులు లేరు ......వారెవరైనా కావచ్చు అనుకున్నాడు.
అచ్యుతా......అని పిలుస్తుంది అంటే భక్తులను జారిపోనివ్వని వాడు అని అర్ధం. అలాంటి దేవతలు ఎందరు లేరు అని మిన్న కున్నాడట....... కృష్ణుడు.
గోవిందా అని ఆర్తిగా పిలిచింది ద్రౌపది. అంతే పులకరించిప్ పోయాదట కృష్ణుడు . వెంటనే ద్రౌపది రక్షణ భారం వహించాడు . అంత ప్రీతి కృష్ణుడు కి గోవింద నామం అంటే.
గోవర్ధన గిరిని చిటికేనా వ్రేలిపై నిలిపి ఇంద్రుని అహాన్ని చిదిమిన సమయాన అణుకువ తో ఇంద్రుడు పలికిన నామం.. ఈ గోవిందం అంతే కాదు ఆ కృష్ణ భగవానుని ఆర్చామూర్తి అయిన శ్రీనివాసునకు గోవింద నామం అంటే మహా ప్రీతి. ఒక్కసారి గోవిందా అంటే ఆయనకు వెను వెంటనే
పరవళ్ళు తొక్కుతూ పారే యమునా నది……ఆ నది ఒడ్డూనే సుగంధ సుకుమార సుమనోహర నాయనానందకరమై నానా వర్ణ శోబితమై అలరించే పులవనమ్ ………….బృందావనం
ఆ బృందావనం లో ముగ్ధ మనోహర గోపికలు……ప్రత్యేకించి తన చైతన్య దీపిక హృదయ నివాసిని అయిన నేచ్చెలి రాధ……… ఆ సరాగాలు…………సరసాలు
పెరిగిన గోకులం………తనకు ప్రియ నెస్తాలైన గోప బాండ్ర తో……ఆటపాటలు ఆల మందల అంబారావాలు………వేణు నాద తరంగాలు
యశోదా ప్రేమ………కమ్మనైన వెన్న మీగడ ల రుచి ఇవన్ని ఒక్కసారిగా ఆ వెంకట నాధుని మదిలో అలా కదులాడుతాయి……..ఆయన ఆ జ్ఞాపకాల తో పులకీతాంతరంగుడై మనపై కరుణాంతరంగు దావుతాడు భజ గోవిందం……….భజ గోవిందం
గోవిందం భజ మూడమతె
4 comments:
తెలియని విషయం చెప్పారు. థాంక్స్.
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయ పరమానందా
గోవిందాది నామోచ్చారణ
కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవల నీవల నోరగుమ్మలుగ
ఆడుద మీతని పాడుదము
అన్నారు అన్నమాచార్యులు.
గోవింద నామము గోవిందునికి ఎంత ప్రీతికరమో భక్తులకుకూడా అంతే ప్రీతికరము.
గోవిందాహరిగోవిందా ! గోకులకృష్ణా గోవిందా !
మా ఇంటిని అదే మా బ్లాగును(లీలామోహనం) ఒకసారి సందర్శించండి .
word verification తీసివేయగలరు.ఒకవేళ మీకు తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html
Thanks. I didnt know this all these days.
adithyuniki.. meeru hrudayaanni arpinchesaaru..
its really nice.
Post a Comment