Wednesday, June 24, 2009
ప్రేయసీ
ప్రేయసీ (krishna saastri gaari.........krishna paksham nundi)
ప్రేయసీ ప్రేయసీ ప్రియుడనే ప్రేయసీ !
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్ననే !
నల్ల మేఘాలలో నాయమా దాగంగ ?
తల్లడిలవో నన్ను తలచి రావో !
మెరుపు వై యోయ్యారి యెరపు వై
యరసి నంతనే మబ్బు తెరల దాగితివా !
తళుకు మని కనిపించి వలపు వెల్లువ ముంచి
వలపించి మాయమై వనట గూర్చితివా !
నల్ల మబ్బుల నింగి నా సౌధ రాజమ్ము
నల్ల మబ్బే ప్రియుడు నన్ను గోరకుమా
ఆడుచును బాడుచును హాయిగా నవ్వుచును
పాడు మేఘాలతో పరుగెత్తే మెరపు
Monday, June 22, 2009
NRUSIMHAA
ఇట్లు దానవేంద్రుండు పరిగ్రుహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును,రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును,వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును ,తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి హరి నిందు జూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున సభామండప స్థంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలును మిణుగురులు సెదర జిటిలి పెటిలి పడి బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా బలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన చట చ్చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి యాకాస కుహరాన్తరాళమ్బు నిరవకాసంబు సేసి నిండినం బట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవసంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాన్కుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంభరాభర దౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినిధర కూర్మ కులశేఖరుండును దుగ్ద జలధి జాత శుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళున్డును ఘన ఘణాయమాన మణికిన్కినీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేసుండును , నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును , కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును , దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాస , రక్షో రాజ వక్షో భాగ విసంకటక్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన ,ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును , శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగా మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన , మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళున్డును , మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భుషితుండును , త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కన్ధరుండును ,ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశా సంచలితాధరుండును . శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును , కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజ్రుమ్భమాణ సప్తజిహ్వ జిహ్వా తులిత తరళ తరాయమాన విబ్రాజమాన జిహ్వుండును , మేరు మందర మహా గుహాన్తరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును , నాసికా వివర నిస్సర న్నిబిడ నిస్స్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును , పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సద్రుక్ష సమంచిత లోచనుండును , లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగా వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును Saక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును , ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును , సంధ్యారాగ రక్త దారధరమాలికా ప్రతిమ మహా బ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును ,సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును , నిష్కంపిత శంఖ పర్ణా మహోర్ద్వకర్ణుండును , మన్ధదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శికరాకార భాసుర కేసరుండును , పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహున్డును , నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావత సార్వభౌమ ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును , ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును , దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపన్ధి యాతుదాన నికురుంబ గర్వాంధకారుండును , బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును , మహా ప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుం డావిర్భవిన్చినమ్ గనుంగొని . (పోతన మహానుభావుని చే వివరించబడిన మహోన్నతమైన శ్రీ నృసింహ దేవుని అవతార వర్ణన మహాభాగవతం నుండి తెలుగు చదవండి దానిలోని తీయదనాన్ని ఆస్వాదించండి )
పిక్: స్టార్
Wednesday, June 3, 2009
brundaavana vihari
బృందావన వీదుల తిరిగేని దేవకీ సుతుడు
గోపికల మురిపించు సింగారముల తోడను
వెన్న మీగడల దొంగిలించు నొకమారు
ఆల మందల అంబా రవముల మురిసేనోకమారు బృందావన
ఆటపాటల గోపబాలకుల అలరించు నొకమారు
అల్లరి చేష్టలతో రక్కసుల దునుమార్చు నొకమారు బృందావన
గోవర్ధనమెత్తి ఇంద్రుని అహమణిచే నొకమారు
గోవత్స బృందమంతయు తానై గోకులమునకు ముదమోనర్చే నొకమారు బృందావన
కాళింది శిరమున తాండవమాడే నొకమారు
గోపికల కూడి సరస సల్లపములాడే నొకమారు బృందావన
యశోద మమతల త్రాటికి బంది అయ్యేనోకమారు
విస్వమునెల్ల నోట బంధించి చూపే నొకమారు బృందావన
వలువలు దాచి గోపికల వ్యామోహ ధనం దోచే నొకమారు
భిక్ష కోరి బ్రహ్మణ సతుల మోక్షమొసగే నొకమారు బృందావన
ఎల్లమారులు నా మనోబృందావనమున నడయాడి
రోగములను పాపములను పరిహరించే ని వాసుదేవుడు బృందావన
pic: stiphen
Subscribe to:
Posts (Atom)