Thursday, December 6, 2012

అజ్ఞాతవాసి












ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
 పలకరింపులనే తొలకరింపులను మాపై 
చిలకరింపు ఎదురుచూపులతో ఎండిన
కనుల కోలనులలో కలువలు పూయించు

 ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు 
తడి తడి తళుకులతో అలరారు లేలేత 
చిగురుటాకుల పెదవులపై చిరునవ్వులు 
కురిపించు ఆప్తుని ఆదరం లేక అవిసిపోయిన 
అధరాలపై ఆనందపు జల్లులు కురిపించు


ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
 జ్ఞాపకాల దొంతరలను కదిలించి తీపి 
గురతుల ఆనవాళ్ళను పెకలించి 
మోడువారిన గుండె గూటిలో నీ చిలిపి
 అల్లరుల చిరుగజ్జెలు మోగించు 

ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
 చేతిలో చేతిని కలిపి చూపులో చూపుని
 నిలిపి నీడను కాను నీలో సగాన్ని
 అని నాలో నిలిచిపో


Saturday, November 24, 2012

మాయ చాలా చిన్న పదం చాలా లోతైన పదం అందరికి అనువైన పదం ఎవ్వరికి అంతుబట్టని పదం ఎవ్వరు అతీతులు కాని పదం ఈ జగం లోని జనులందరిచే ఆ జగన్నాటక సూత్రదారి జనార్ధనుడు ఆడించే ఆటకు ఆయువుపట్టు ఈ మాయ మాయ చేతికి చిక్కని వాళ్ళు మాయకు లొంగని వాళ్ళు లోకం లో లేనే లేరు కొందరిని రూప లావణ్యాలతోను లో మరికొందరిని సిరి సంపదల రూపంలోనూ ఇంకొందరిని అధికార దర్పం రూపం లోను , ఇలా నానా రకాల జనులను నానా రకాలుగా మోహ పరచి వారి పలు రకాల వింత చేష్టలను వినోదంగా వీక్షిస్తుందీ మాయ అంతటి శక్తివంతమైంది ఈ మాయ అసలు ఇంతకూ ఏమిటి ఈ మాయ ? ఎవరు ఈ మాయ , ఈ లోకంలో అత్యంత శక్తివంతులెవ్వరు ......ఇంకెవ్వరు.....నారాయణుడు ........నారాయణి ఆ నారాయణి అంశ ......మాయ నారాయణి మరో పేరు దుర్గ మాత తానే మాయా స్వరూపం కనుక దుర్గమ్మ కను సన్నలలో మాయ చరిస్తూ వుంటుంది ఆ నారాయణుడికి సోదరిగా బృందావనంలో మహా మాయగా అవతరించింది కనుక ఆ క్రిష్ణునికి విధేయంగా వుంటుంది సకల శుభదాయకుడు ఆ శివునికి సగమై సర్వమంగళ గా శుభాలు కలిగించేది ఈ దుర్గమ్మ కనుక ఆ మాయ ఈ పరమేష్టిని కూడా చేరదు కనుక మాయను దాటాలంటే మాయాతీతులైన ఈ మువ్వురి ఆరాధన మనకు తప్పనిసరి . అందుకే ముఖ్యమైన మాసాలన్ని కుడా హరి హర పూజకు అనువుగా వుంటాయి. కార్తీకం లో శివ పూజ ఎంతటి విశేషమో దామోదరుడి పూజ కూడా అంతే ఆవశ్యకం హరిహరులను సేవిద్దాం మాయను చేదిద్దాం