సృష్ట్యాదివి నీవు సృష్టి అంతము నీవు ఆది అంతముల
నడుమ సాగు జీవన యానపు మూల కారణమగు కర్మ
రూపుడవు నీవు కర్మ ఫలముల దోషము పరిహరించి
ఆరోగ్య మీయవే లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా
సర్వనిలయుడా సర్వేశ్వరుడు
హృదయ మధ్యమున పద్మపత్రంలో
అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు
సదా ధ్యానించు వారలకు సకల భయాలు
తొలగి విష్ణుపదం సన్నిహితమవుతు
యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రౌ ద్విజన్మపదపద్మశరావభూతామ్ ।
తేనాంబుజాక్షచరణాంబుజషట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ ॥ ౪౦ ॥
నా మిత్రులు జ్ఞాన మూర్తులు
కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు
ద్విజోత్తములు (ద్విజన్మవరుడు , పద్మ శరుడు) .
నేను కులశేఖర చక్రవర్తి ని
ఈ పద్య కుసుమాలు పద్మాక్షుని
చరణాంబుజములకు
భక్తి ప్రపత్తులతో సమర్పితం
కుంభేపునర్వసౌజాతం కేరళే చోళపట్టణే ।
కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే ॥
ఇతి ముకుందమాలా సంపూర్ణా ॥
ఓ హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు
నీవు దయా సముద్రుడవు
పాపులకు మరల మరల ఈ భవసాగరమే
గతి అగుచున్నది
నీ దయావర్షం నాపై కురిపించి
నన్ను ఉద్దరించు ముకుందా
క్షీరసాగరతరంగశీకరా –
సారతారకితచారుమూర్తయే ।
భోగిభోగశయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమః ॥ ౩౯ ॥
పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ
నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా
శేషతల్పం మీద సుఖాసీనుడవైన మా
మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక ప్రణామములు
అమృతము కన్న మిన్నయగు క్షీరము